తెలుగు మహాసభలు అద్భుతం : మోహన్‌బాబు

19-12-2017

తెలుగు మహాసభలు అద్భుతం : మోహన్‌బాబు

తెలుగు భాష వ్యాప్తి కోసం మహా సభల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతంగా నిర్వహిస్తున్నారని సినీనటుడు మోహన్‌బాబు అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్‌బీ మైదానంలో నిర్వహించిన సంగీత విభావరి ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిత్వంపై ఒక పుస్తకం రాయవచ్చన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణ సాధనకోసం పోరాడిన యోధుడని కొనియాడారు. తండ్రికి తగిన తనయుడు కేటీఆర్‌ అని ప్రశంసించారు. లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు వచ్చిందుకు కేటీఆర్‌ను మోహన్‌బాబు సత్కరించారు.