Balakrishna speech at World Telugu Conference

ప్రాంతాలు వేరైనా మన భాష తెలుగు భాషని, తెలుగు వారంతా స్నేహభావంతో కలిసిమెలసి ఉంటున్నారని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. మహాసభల్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని, దీని నిర్వహణకు పూనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుగడ్డ మీద పుట్టిన సినారె, దాశరథి, నుండి ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌ దాకా ఎంతోమంది ఖ్యాతిని చాటారన్నారు. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు మారదన్నారు. అన్న అనగానే మా నాన్నే గుర్తుకు వస్తారని,  తెలుగు అన్న పదం వింటే తన మనసు పులకిస్తుందన్నారు. తెలుగులో మొదట 36 అక్షరాలు మాత్రమే ఉండేవని, సంస్కృతం నుండి 19 అక్షరాలను నన్నయ తీసుకొచ్చారన్నారు. తెలుగుభాష తల్లిని కాపాడుకునేందుకు అందరం కృషి చేయాలని, తెలంగాణ ప్రభుత్వం మహాసభలు నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.