పిజ్జా- 2 డెలివరీకి రెడీ

01-09-2017

పిజ్జా- 2 డెలివరీకి రెడీ

డీవీ సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మాత డి.వెంకటేష్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం పిజ్జా-2. తమిళ సినీ రంగంలో వరస హిట్లతో దూసుకుపోతున్న హీరో విజయ్‌సేతుపతి, గాయత్రి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రంజిత్ జయకోడి. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ..తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన  'పురియత్ పుధీర్' చిత్రాన్ని పిజ్జా-2 గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడిందీ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దాడు. సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం..అని తెలిపారు. 

విజయ్ సేతుపతి, గాయిత్రి, రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్, ఎడిటర్: భవన్ శ్రీకుమార్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: రంజిత్ జయకోడి.