Asalem Jarigindi Telugu Movie Press Meet

రోజాపూలు, ఒకరికిఒకరు, తరువాత తెలుగులో మళ్ళీ నాకు ఆ స్థాయి గుర్తింపును తీసుకొచ్చే చిత్రం అసలేం జరిగింది.  కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది అన్నారు కథానాయకుడు శ్రీరామ్. తెలుగులో కొంత విరామ తర్వాత హీరో శ్రీరామ్ నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది. ఎక్సోడస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్  దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. కాగా ఈ చిత్రంలోని పాటల జ్యూక్ బాక్స్‌ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదల చేశారు.  

ఈ సందర్భంగా  నిర్మాత చిత్ర విశేషాలను  తెలియజేస్తూ  చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా విజయ్‌ఏసుదాస్ చాలా రోజుల తర్వాత తెలుగులో పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకునే విధంగా వుంది. తెలంగాణలో చిత్రీకరించిన ఈ పాటలను తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఆనందంగా వుంది. మహావీర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ, చిర్రావూరి విజయ్‌కుమార్, వెంకటేష్ తదితరులు పాటల్నీ రచించారు.విజయ్‌ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవికలు పాటలు ఆలపించారు. గ్రామీణ నేపథ్యంలో  కొనసాగే ఒక సస్పెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు.