Ashok Galla speical video for Superstar Krishna Birthday

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆదివారం (మే 31) సినిమా నిర్మాత‌లు ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. నిజానికి అది 'య‌మ‌లీల' చిత్రంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ చేసిన సూప‌ర్ హిట్ సాంగ్ 'జుంబారే'కు రీమిక్స్‌. లెజండ‌రీ అయిన తాత‌య్య‌ను ఆ పాట‌లో అశోక్ గ‌ల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆక‌ట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్.. పాట‌కు స‌రిగ్గా స‌రిపోయాయి. ఆ పాట‌లో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ సైతం మెర‌వ‌డంతో ఈ ప్ర‌త్యేక‌మైన రోజు సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు ప‌ర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన‌ట్ల‌యింది.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ 50 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.
అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
తారాగ‌ణం:  అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య,‌ సాంకేతిక బృందం: డైలాగ్స్‌: క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌. ఠాగూర్‌ మ్యూజిక్‌:  జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, సమీర్ రెడ్డి ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి ఆర్ట్‌: ఎ. రామాంజ‌నేయులు పీఆర్వోలు :  బి.ఎ. రాజు, వంశీ-శేఖ‌ర్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చ‌ంద్రశేఖ‌ర్ రావిపాటి నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లా క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌రామ్ ఆదిత్య టి.