https:Jabardasth fame Anasuya dares to share her period story

న్యూస్ రీడ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత చిన్న చిన్న స్టేజ్ షోల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ మెల్ల మెల్ల‌గా త‌న కెరీర్‌ని అందంగా మ‌లుచుకోవ‌డానికి ఎంతో కృషి చేసింది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. మొద‌ట్లో తెలుగు స‌రిగా మాట్లాడ‌డం వ‌చ్చేది కాదు. ఓ సినిమా ఈవెంట్‌లో ఆమె మాట్లాడిన తీరుకు మండిప‌డ్డ దాస‌రి నారాయ‌ణ‌రావు `ముందు నువ్వు తెలుగు స‌రిగా నేర్చుకో..త‌ర్వాత ప్రోగ్రామ్స్ చేద్దువుగాని` అని మంద‌లించారు.

దాంతో ప‌ట్టుద‌ల పెంచుకున్న అన‌సూయ తెలుగులో స్ప‌ష్టంగా, అంత‌కంటే అందంగా మాట్లాడ‌డం నేర్చుకుంది. ఇప్పుడు టాప్ యాంక‌ర్‌గా అంద‌రి చేతా శ‌భాష్ అనిపించుకుంటోంది. టీవీల్లో ప్రోగ్రామ్స్ చెయ్య‌డం, సినిమాల్లో క్యారెక్ట‌ర్స్ చెయ్య‌డ‌మే కాదు, స‌మాజం ప‌ట్ల కూడా మంచి అవ‌గాహ‌న ఉంది ఆమెకు. అందుకే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

స‌మాజంలో జ‌రిగే కొన్ని ఘ‌ట‌న‌ల‌పై స్పందిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం ఏ విష‌యం గురించైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడే స్టేజ్‌కి వ‌చ్చేసింది అన‌సూయ‌. ఇటీవ‌ల మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకుంది అనసూయ.

మే 28న అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా పేజీలో మాట్లాడింది అనసూయ. అందులో తన మొదటి పీరియడ్స్ అనుభవాన్ని దైర్యంగా అందరితో షేర్ చేసుకుంది. నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోని తన ఇ‌న్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది అనసూయ.

ఈ వీడియోను చూసిన వారంతా ఆమె ధైర్యానికి మెచ్చ‌కుంటున్నారు. ఇలాంటి విష‌యాలు దాచుకోకూడ‌ద‌ని, బ‌య‌టికి చెప్ప‌డం వ‌ల్ల ఈత‌రం అమ్మాయిల‌కు ఒక అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె తెలిపింది. త‌న ఫ‌స్ట్ పీరియ‌డ్ స‌మ‌యంలో ఎంతో టెన్ష‌న్ ప‌డ్డాన‌ని, ఆ తర్వాత ప్రతి నెలా ఓ నాలుగైదు రోజులు ఎవరినీ కలిసే ఛాన్స్ ఉండేది కాదని చెప్పింది. ఆ వ‌య‌సులో త‌న‌కు ఏం జ‌రిగిందో తెలియక‌పోయినా 17 సంవ‌త్స‌రాలు వ‌చ్చిన త‌ర్వాత దానిపై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చాన‌ని చెప్పింది అన‌సూయ‌.