త్వరలోనే క్రేజీ మల్టిస్టారర్!

08-04-2020

త్వరలోనే క్రేజీ మల్టిస్టారర్!

బాలీవుడ్‍ అగ్ర కథానాయకులు, ఖాన్‍ల ద్వయం షారూఖ్‍ ఖాన్‍, సల్మాన్‍ఖాన్‍ మళ్లీ సిల్వర్‍ స్క్రీన్‍ మీద మ్యాజిక్‍ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‍లో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత నిఖిల్‍ ద్వివేది సన్నాహాలు చేస్తున్నారట. గతంలో ఈ ఖాన్‍ల ద్వయం నటించిన కరన్‍ అర్జున్‍, హమ్‍ తుమ్హారే హై సనమ్‍, కుచ్‍ కుత్‍ హోతా హై వంటి తదితర చిత్రాలు విశేష ప్రేక్షకాదరణతో బాలీవుడ్‍లో బ్లాక్‍బస్టర్స్గా నిలిచాయి. అలాగే షారూఖ్‍ నటించిన జీరో చిత్రంలో సల్మాన్‍ అతిథి ప్రాతలోనూ మెరిశాడు. ఈ ఖాన్‍ల ద్వయంలో మళ్లీ సినిమా రాబోతోందనే విషయం తెలిసి వీళ్ళ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.