రవితేజ డబుల్ ధమాకా

08-04-2020

రవితేజ డబుల్ ధమాకా

రవితేజ హీరోగా రమేష్‍వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో రవితేజ తన అభిమానులకు డబుల్‍ ధమాకా ఇవ్వనున్నారట. ఎన్‍ఆర్‍ఐ బిజినెస్‍మేన్‍గా, చార్టెడ్‍ అకౌంటెంట్‍గా రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్‍. ప్రస్తుతం గోపీచంద్‍ మలినేని దర్శకత్వం వహిస్తున్న క్రాక్‍ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణక బ్రేక్‍ పడింది. అలాగే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్‍ వక్కంతం వంశీ డైరెక్షన్‍లో రవితేజ హీరోగా ఓ సినిమా సెట్స్పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.