బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్... ప్రియాంకచోప్రా

08-04-2020

బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్... ప్రియాంకచోప్రా

కరోనాపై పోరులో విశేష కృషి చేస్తున్న హెల్త్కేర్‍ వర్కర్స్ సంక్షేమార్థం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. వన్‍ వరల్డ్ టుగెదర్‍ ఎట్‍ హోమ్‍ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు కూడా భాగం కానున్నారు. బాలీవుడ్‍ నుంచి షారుఖ్‍ ఖాన్‍, ప్రియాంకచోప్రాలకు అవకాశం దక్కింది. క్రిస్‍ మార్టిన్‍, లేడీగాగా తదితర తారలతో సాగే ఈ కార్యక్రం ఏప్రిల్‍ 18న ప్రసారం కానుంది.