ఉప్పెన లో విజయ్ సేతుపతి లుక్ విడుదల

02-04-2020

ఉప్పెన లో విజయ్ సేతుపతి లుక్ విడుదల

వైష్టవ్‍ తేజ్‍ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. కరోనా వైరస్‍ లేకపోతే ఏప్రిల్‍ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో జాలరుల జీవితాధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కథానాయికగా కృతిశెట్టి నటిస్తోంది. ఇందులో తమిళ నటుడు విజయ్‍ సేతుపతి కూడా కీలక పాత్ర చేశారు. ఈ చిత్రంలో ఆయన గెటప్‍ను చిత్ర యూనిట్‍ విడుదల చేసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో తెల్ల లుంగీతో చెక్క కుర్చీలో కాలుపై కాలువేసి సిగరేట్‍ తాగుతున్న స్టిల్‍ అది. చిత్రంలో ఆయన పాత్ర చాలా కీలకమైందని యూనిట్‍ చెబుతోంది. అదేమిటో తెలియాలంటే మే మొదటి వారం వరకు ఆగాల్సిందే.