ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్...

02-04-2020

ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్...

సెన్షేషనల్‍ బ్లాక్‍బస్టర్‍ ఇస్మార్ట్ శంకర్‍ తర్వాత హీరో రామ్‍ చేస్తున్న రెడ్‍ సినిమాలో హాట్‍ బ్యూటీ హెబ్బా పటేల్‍ ఐటమ్‍ సాంగ్‍ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్‍ హాఫ్‍లో వచ్చే ఒక స్పెషల్‍ సాంగ్‍లో ఈ బ్యూటీ కనిపించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్‍లో దర్శనమిస్తుందట. అయితే తాజా సమాచారం ప్రకారం హెబ్బా ఈ సినిమాలో ఐటమ్‍ సాంగ్‍తో పాటు గెస్ట్ రోల్‍లో కూడా నటిస్తోందట. కేవలం రెండు సీన్స్లో మాత్రమే ఈ బ్యూటీ పాత్ర ఉన్నప్పటికీ అవి చాలా కీలకమైన సీన్స్ అట. కాగా ఈ పాటను ఇప్పటికే రామోజీ ఫిల్మ్సిటీలో రామ్‍, హెబ్బా మీద షూట్‍ చేశారు. సాంగ్‍ అవుట్‍పుట్‍ చాలా బాగా వచ్చిందని తెలిసింది. మొత్తానికి హీరోయిన్‍ క్యారెక్టర్స్లో మాత్రమే కాకుండా సైడ్‍ క్యారెక్టర్స్, స్పెషల్‍ సాంగ్స్లో కూడా హెబ్బా మెరుస్తోంది.