ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్!

02-04-2020

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్!

ఎన్టీఆర్‍ సరసన శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‍ నటించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‍ తన 30వ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్‍తో చేస్తున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‍కి జోడీగా జాన్వీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్‍, త్రివిక్రమ్‍ కాంబినేషన్‍లో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని పాన్‍ ఇండియా సినిమా తీసుకురావాలనే యోచనలో కూడా చిత్ర బృందం ఉందట. దీని కోసమే ఎన్టీఆర్‍కి పెయిర్‍గా జాన్వీని తీసుకున్నారని వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో కూడా జాన్వీ తెలుగు సినిమాల్లో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. కానీ లేటెస్ట్ న్యూస్‍ మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజమేనని అంటున్నాయి ఫిల్మ్నగర్‍ సర్కిల్స్. అయితే ఈ సినిమాలో జాన్వీ నటించడానికి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్‍ని డిమాండ్‍ చేసిందని సోషల్‍ మీడియాలో కొన్ని వార్తలు హల్‍చల్‍ చేస్తున్నాయి.  మొత్తానికి శ్రీదేవి తనయ ఎన్టీఆర్‍ సరసన టాలీవుడ్‍ సిల్వర్‍ స్క్రీన్‍ మీద మెరవబోతోందన్నమాట.