సూపర్‍ స్టార్‍ మహేష్‍బాబు జోడీగా కీర్తిసురేష్‍ ?

సూపర్‍ స్టార్‍ మహేష్‍బాబు జోడీగా కీర్తిసురేష్‍ ?

24-03-2020

సూపర్‍ స్టార్‍ మహేష్‍బాబు జోడీగా కీర్తిసురేష్‍ ?

సూపర్‍ స్టార్‍ మహేష్‍బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు పరశురామ్‍తో చేయబోతున్నారని తెలిసిపోయింది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమా హీరోయిన్‍ కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోంది. ఆ లక్కీ ఆఫర్‍ మహానటి  కీర్తిసురేష్‍ కి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహేష్‍, కీర్తిలు ఇప్పటివరకు  కలిసి నటించలేదు. కాబట్టి ఇది ఫ్రెష్‍ కాంబినేషన్‍ అవుతుంది. అయితే మహేష్‍ నుంచి గ్రీన్‍ సిగ్నల్‍ రావాల్సి ఉంది. కథానాయికల విషయంలో ఈ సూపర్‍ స్టార్‍ చాలా జాగ్రత్తగా ఉంటాడు. నిజానికి మహేష్‍ సినిమాలో కథానాయికల ఎంపికపై పూర్తి ఆధిపత్యం నమ్రత చేతుల్లోనే ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తుంటాయి. మరి ఆమె ఓకే అంటేనే మహర్షి పక్కన మహానటి ని చూసేయవచ్చు.