నాగరత్తమ్మ పాత్రలో అనుష్క

నాగరత్తమ్మ పాత్రలో అనుష్క

24-03-2020

నాగరత్తమ్మ పాత్రలో అనుష్క

మహిళా ప్రధాన చిత్రాల్లో నటించడం అనుష్కకు కొత్తేమి కాదు. తాజా సమాచారం ప్రకారం అనుష్క మరో మహిళా ప్రధాన ఇతివృత్తంలో నటించబోతున్నదని సమచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ కర్ణాటక గాయని, మహిళా హక్కుల ఉద్యమకారిణి బెంగళూరు నాగరత్తమ్మ జీవిత కథా చిత్రంలో అనుష్క నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేయబోతున్నట్లు సమచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించే ఈ సినిమా కోసం అనుష్కతో పాటు సమంత పేరు కూడా పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. పాన్‍ఇండియాగా రూపొందించే సన్నాహాల్లో భాగంగా బాలీవుడ్‍ అగ్రనాయిక దీపికాపదుకొనే పేరు కూడా తెరపైకి వచ్చినట్లు సమచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికార ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం అనుష్క కథానాయికగా నటించిన నిశ్శబ్దం చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.