తండ్రీకూతుళ్లుగా అమితాబ్, కత్రినా

తండ్రీకూతుళ్లుగా అమితాబ్, కత్రినా

24-03-2020

తండ్రీకూతుళ్లుగా అమితాబ్, కత్రినా

అమితాబ్‍ బచ్చన్‍, కత్రినా కైఫ్‍ త్వరలోనే తండ్రీ కూతుళ్లు కానున్నారట. తండ్రీ- కూతుళ్ల బంధం మీద బాలీవుడ్‍ దర్శకుడు విశాల్‍ బాల్‍డెడ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అంత్యక్రియల కార్యక్రమం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందట. ఇందులో అమితాబ్‍ బచ్చన్‍, కత్రినా తండ్రీ కూతుళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో నటించడానికి ఆల్రెడీ తమ అంగీకారాన్ని తెలిపారట బచ్చన్‍. కత్రినా, ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‍ను మే నెలలో ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వైరస్‍ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ కొన్ని రోజులు ఆగి ప్రారంభించాలనుకుంటున్నారు.