నితిన్ రూ.20 లక్షల విరాళం

నితిన్ రూ.20 లక్షల విరాళం

24-03-2020

నితిన్ రూ.20 లక్షల విరాళం

కరోనాని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల కోసం నితిన్‍ రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కొవిడ్‍-19 వ్యాప్తిని ఆరికట్టడంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని, ఈ క్రతువులో తన వంతు భాగస్వామ్యం ఉండాలనే ఆర్థిక సాయం ప్రకటించానని నితిన్‍ తెలిపారు. ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‍డౌన్‍కి ప్రజలందరూ సహకరించి కోవిడ్‍ -19 వ్యాప్తిని నిరోధించడంలో పాలుపంచుకోవాలని నితిన్‍ కోరారు.