మెగాస్టార్‍ ఇంటి ముందు నిరాహార దీక్ష

మెగాస్టార్‍ ఇంటి ముందు నిరాహార దీక్ష

27-02-2020

మెగాస్టార్‍ ఇంటి ముందు నిరాహార దీక్ష

ఆంధ్రులకు ఒకటే రాజధాని పేరుతో ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ సంచనల ప్రకటన చేసింది. టాలీవుడ్‍ మెగాస్టార్‍ చిరంజీవి ఇంటిముందు దీక్షకు దిగుతామని ప్రకటించింది. హైదరాబాద్‍లోని చిరంజీవి ఇంటి ముందు ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తామని ప్రకటనలో పేర్కొంది. రాజధాని రైతులకు, మహిళలకు, రైతు కూలీలకు చిరంజీవి మద్దతు తెలపాలని కోరింది. అమరావతి మద్దతుదారులు తమ దీక్షకు సంఘీభావం తెలపాలని, దీక్షను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసింది.