డొనాల్డ్ ట్రంప్‍కు ఏఆర్‍ రెహ్మాన్‍ కృతజ్ఞతలు

27-02-2020

డొనాల్డ్ ట్రంప్‍కు ఏఆర్‍ రెహ్మాన్‍ కృతజ్ఞతలు

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‍కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍నకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‍ రెహ్మాన్‍ కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యటనలో భాగంగా ట్రంప్‍ దంపతులకు రాష్ట్రపతి భవన్‍లో విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ఆస్కార్‍ నాయకుడు ఏఆర్‍ రెహ్మాన్‍ కూడా ఇందులో పాల్గొన్నారు. ట్రంప్‍కు రెహ్మాన్‍ను రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍ పరిచయం చేశారు. ఈ సందర్భంగా తీసిన సెల్ఫీని ఏఆర్‍ రెహ్మాన్‍ ట్విట్టర్‍లో పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగ్ర దేశాధినేతకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.