అంధాధున్‍ రీమేక్‍లో రమ్యకృష్ణ?

అంధాధున్‍ రీమేక్‍లో రమ్యకృష్ణ?

26-02-2020

అంధాధున్‍  రీమేక్‍లో రమ్యకృష్ణ?

హిందీలో ఆయుష్మాన్‍ ఖురానా నటించగా ఘన విజయం సాధించిన ఆంధాదున్‍ చిత్రాన్ని తెలుగులో రీమేక్‍ చేస్తుండడం తెలిసిందే. నితిన్‍ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‍ హోమ్‍ బ్యానర్‍లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కాగా హిందీలో టబు పోపించిన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. అంధాదున్‍ కథలో టబు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందువల్ల టబు చేసి మెప్పించిన పాత్ర రమ్యకృష్ణలా ఓ స్టేచర్‍ ఉన్న నటి అయితేనే రక్తి కడుతుందనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారని సమాచారం.