రాధాకృష్ణలో లక్ష్మి పార్వతి కీలక పాత్ర

రాధాకృష్ణలో లక్ష్మి పార్వతి కీలక పాత్ర

26-02-2020

రాధాకృష్ణలో లక్ష్మి పార్వతి కీలక పాత్ర

అనురాగ్‍, ముస్కాన్‍సేతి జంటగా నటిస్తున్న చిత్రం రాధాకృష్ణ. ప్రసాద్‍వర్మ దర్శకుడు. పుప్పాల సాగరిక, శ్రీనివాస్‍ కానురు నిర్మాతలు. నందమూరి లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పల్లెవాతావరణంలో భావోద్వేగభరితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. కనుమరుగవుతున్న నిర్మల్‍ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో హృదయాల్ని హత్తుకుంటుంది. ప్రతి సన్నివేశం సహజంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమా ఇది అన్నారు. సంపూర్ణేష్‍బాబు, కృష్ణభగవాన్‍, చమ్మక్‍ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: టి.సురేందర్‍రెడ్డి, సంగీతం:ఎం.ఎం.శ్రీలేఖ. ఆర్‍:సాయి మణి, దర్శకత్వం: ప్రసాద్‍వర్మ.