మరో రీమేక్‍లో అనసూయ

మరో రీమేక్‍లో అనసూయ

26-02-2020

మరో రీమేక్‍లో అనసూయ

యాంకర్‍గా గుర్తింపు దక్కించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లి తెర, వెండి తెరపై తన ప్రభంజనం చూపిస్తోంది. రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్త పాత్రలో ఒక్కసారిగి ఈ బ్యాటీ వెండి తెరపై స్టార్‍ అయింది. అప్పటి నుండి ఆమెకు కీలక పాత్రల్లో నటించే ఆఫర్లు వస్తున్నాయి. వస్తున్న ప్రతి ఆఫర్‍ను ఒప్పుకోకుండా ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అనసూయ తాజాగా నితిన్‍ హీరోగా చేస్తున్న అంధాధున్‍ రీమేక్‍లో కీలక పాత్ర చేసేందుకు ఓకే చెప్పింది. హిందీలో అంధాధున్‍ చిత్రంలో టబుది కీలక పాత్ర, హీరోతో ఎక్కువ కాంబో సీన్స్ ఉంటాయి. సినిమా కథలో ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర కాస్త బోల్డ్గా కూడా ఉంటుంది. అలాంటి పాత్రకు అనసూయ ఎంపిక కావడం విశేషం.