నేను ఎప్పటికైనా ప్రేమ వివాహమే

నేను ఎప్పటికైనా ప్రేమ వివాహమే

26-02-2020

నేను ఎప్పటికైనా ప్రేమ వివాహమే

హలో చిత్రంతో టాలీవుడ్‍లో హీరోయిన్‍గా పరిచయమైన భామ కళ్యాణి ప్రియదర్శన్‍. మొదటి సినిమా నిరాశ పర్చడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. దాంతో సొంత భాష మలయాళంతో పాటు తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. అక్కడ ఆమె కెరీర్‍ కాస్త ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. తమిళం, మలయాళంలో పెద్ద సినిమాలు చేసింది. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్‍ పెళ్లి గురించి మాట్లాడుతూ నేను ప్రేమ వివాహం చేసుకుంటాను. అయితే ఇప్పటివరకు నేను ఎవరితోనూ ప్రేమలో పడలేదు. అయితే నేను ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటాను అని చెప్పింది.