హలో మేడమ్ చిత్రం లోగో ఆవిష్కరణ

హలో మేడమ్ చిత్రం లోగో ఆవిష్కరణ

22-02-2020

హలో మేడమ్ చిత్రం లోగో ఆవిష్కరణ

నవీన్‍.కె.చారి, ప్రియాంశ, మేఘన చౌదరి, సుమాయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హలో మేడమ్‍. వడ్ల జనార్దన్‍ దర్శకుడు. వడ్ల గురురాజ్‍, వడ్ల కార్తిక్‍ నిర్మాతలు. హైదరాబాద్‍లో ఈ చిత్ర లోగోను దర్శకుడు సాగర్‍, తెలంగాణ ఫిలిం ఛాంబర్‍ ఆఫ్‍ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‍ సంయుక్తంగా విడుదల చేశారు. సాగర్‍ మాట్లాడుతూ హారర్‍ థ్రిల్లర్‍ అంశాలతో ఘటికాచలం అందించిన కథను దర్శకుడు జనార్ధన్‍ చక్కగా తెరపై ఆవిష్కరించారు అని తెలిపారు. చిన్న సినిమాల్ని ఆదరిస్తేనే కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారని, ఈ సినిమా విజయాన్ని సాధించి యూనిట్‍ అందరికి పేరు తెచ్చిపెట్టాలని ఆర్‍.కె.గౌడ్‍ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నాం. సైకో కిల్లర్‍ కథ ఇది. అతడిని అంతమొదించినదెవరన్నది ఆకట్టుకుంటుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఘటికాచలం, సాయివెంకట్‍, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.