మోస‌గాళ్ళు చిత్రం నుండి కాజల్ లుక్

మోస‌గాళ్ళు చిత్రం నుండి కాజల్ లుక్

22-02-2020

మోస‌గాళ్ళు చిత్రం నుండి కాజల్ లుక్

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మోసగాళ్ళు. కాజల్‍ అగర్వాల్‍, రుహానిసింగ్‍ నాయికలు. జెఫ్రీ జీ చిన్‍ దర్శకుడు. వెరోనిక మంచు నిర్మాత. ఈ చిత్రంలో కాజల్‍ అను యువతిగా కనిపించబోతోంది. వాస్తవ సంఘటనల్ని ప్రతిబింబిస్తూ, దేశంలో జరిగిన ఒక పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో సాగే చిత్రమిది. లాస్‍ ఏంజిలిస్‍లో ఇటీవల కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాం. ఈ ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేస్తాం. శివరాత్రి సందర్భంగా కాజల్‍ లుక్‍ను విడుదల చేశాం. అను అనే పాత్రలో ఆమె శక్తిమంతంగా, ఇదివరకు చేసిన పాత్రలకి భిన్నంగా కనిపించబోతోంది. అను ఎవరు? ఆమె కథేంటి? అన్నది తెరపైనే చూడాలని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. బాలీవుడ్‍ నటుడు సునీల్‍ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.