అంజలికే ఆ అవకాశం

అంజలికే ఆ అవకాశం

22-02-2020

అంజలికే ఆ అవకాశం

సింహా, లెజండ్‍ చిత్రాల అనంతరం బాలకృష్ణ-బోయపాటి కలయికలో త్వరలో సెట్స్కి వెళ్లునున్న చిత్రంలో హీరోయిన్స్ అంటూ పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఒకటి అంజలి. బాలయ్యతో డిక్టేటర్‍ చిత్రంలో నటించిన అంజలి.. బోయపాటి దర్శకత్వంలో రూపొంది భారీ విజయం అందుకున్న సరైనోడు చిత్రంలో బ్లాక్‍బస్టర్‍ అనే స్పెషల్‍ సాంగ్‍లో నటించింది. ఈ రెండు అంశాల దృష్టా బాలయ్య-బోయపాటి కాంబినేషన్‍లో రూపొందనున్న చిత్రంలో ఓ హీరోయిన్‍గా అంజలిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.