రాధాకృష్ణలో లక్ష్మీపార్వతి...

రాధాకృష్ణలో లక్ష్మీపార్వతి...

22-02-2020

రాధాకృష్ణలో లక్ష్మీపార్వతి...

హారిని ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శ్రీనివాసరెడ్డి సమర్పణలో పుప్పాల సాగరిక, శ్రీనివాస్‍ కానూరు నిర్మించిన చిత్రం రాధాకృష్ణ. చిత్రంలో పోషిస్తోన్న కీలక పాత్రలో లక్ష్మీపార్వతి తెరపైకి వస్తున్నారు. సినిమాపై మక్కువతో సెల్ఫ్మేడ్‍ స్టార్‍గా ఎదిగిన సంపూర్ణేష్‍ బాబు మరో పాత్ర పోషిస్తున్నాడు. అనురాగ్‍, ముస్కాన్‍ సేథీ లీడ్‍ రోల్స్ చేస్తున్నారు. నిర్మల్‍ కొయ్య బొమ్మల నేపథ్యంగా పల్లె వాతావరణంలోని అనుబంధాలు, ఆప్యాయతలు, భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమకథే- రాధాకృష్ణ, ప్రసాద్‍ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో ఆలీ, కృష్ణభగవాన్‍, చమ్మక్‍చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్‍ పార్ట్ పూర్తైందని, త్వరితగతిన పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తెస్తామని చిత్రబృందం వెల్లడించింది.