హర్భజన్ చిత్రంలో యాక్షన్ కింగ్

హర్భజన్ చిత్రంలో యాక్షన్ కింగ్

19-02-2020

హర్భజన్ చిత్రంలో యాక్షన్ కింగ్

భారత మాజీ క్రికెటర్‍ హర్భజన్‍సింగ్‍ ఫ్రెండ్‍షిప్‍ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తమిళ బిగ్‍బాస్‍ ఫేమ్‍ లోస్లియా మరియనేసన్‍ కథానాయిక. జాన్‍ పాల్‍ రాజ్‍, శ్యామ్‍ సూర్యల సంయుక్త దర్శకత్వంలో జేపీఆర్‍, స్టాలిన్‍ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర చేయడానికి అంగీకరించారు యాక్షన్‍ కింగ్‍ అర్జున్‍. అలాగే తమిళ యాక్టర్‍ సతీష్‍ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.