విరాటపర్వంలో నందితా దాస్ జాయిన్

విరాటపర్వంలో నందితా దాస్ జాయిన్

19-02-2020

విరాటపర్వంలో నందితా దాస్ జాయిన్

విరాటపర్వం లో అడుగుపెట్టారు ప్రముఖ నటి నందితా దాస్‍. నీది నాదీ ఒకే కథ ఫేమ్‍ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించిన నందితా దాస్‍ ఈ సినిమా షూటింగ్‍లో జాయిన్‍ అయ్యారు. మళ్లీ తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు నందితాదాస్‍. 2006లో వచ్చిన కమ్లీ చిత్రం తర్వాత నందిత నటిస్తున్న స్ట్రయిట్‍ తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. దాదాపు 14 ఏళ్ల తర్వాత నందిత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది. తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్‍ సినిమాలో ప్రియమణి, ఈశ్వరీరావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు.