'పోస్టర్' సినిమా టీజర్ విడుదల

'పోస్టర్' సినిమా టీజర్ విడుదల

19-02-2020

'పోస్టర్' సినిమా టీజర్ విడుదల

శ్రీసాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‍పై టి.మహిపాల్‍ రెడ్డి దర్శకుడిగా విజయ్‍ ధరన్‍, రాశి సింగ్‍, అక్షత సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజర్‍ నిర్మాత డి.సురేష్‍ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్‍ బాబు మాట్లాడుతూ టీజర్‍ చూసిన తరువాత మహిపాల్‍ రెడ్డి ప్రతిభ ఏంటో అర్ధమైంది. తనకిదే తొలి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని గ్రాండ్‍గా తీయడం అభినందించాల్సిన విషయం. ఇక టీజర్‍ చూస్తుంటే ధీయేటర్‍ నేపథ్యంలో తీసిన సినిమా అని అర్ధమవుతుంది. ప్రేక్షకులను థియేటర్‍కి రప్పించే అంశాలు మెండుగా ఉన్నాయి. ఈ టీజర్‍, చిత్ర టీమ్‍ యొక్క స్పిరిట్‍ చూసాక సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతుంది అని అన్నారు.