పైలెట్ గా కంగనా

పైలెట్ గా కంగనా

18-02-2020

పైలెట్ గా కంగనా

జర్జిమెంట్‌ హై క్యా, పంగా తర్వాత కంగనా రనౌత్‌ తన తర్వాతి సినిమా ఫస్ట్‌ లుక్‌తో వచ్చేసింది. త్వరలో రాబోతున్న తేజస్‌ చిత్రంలో పైలెట్‌ పాత్రను పోషించనున్నారు కంగనా. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేశారు. ఇందులో కంగనా పైలెట్‌ యూనిఫాంలో కళ్ళజోడు పెట్టుకొని, చేతిలో హెల్మెట్‌ పట్టుకొని, ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కంగనా సోదరి రంగోలి, చిత్ర యూనిట్‌, ట్రెడ్‌ ఎనాలిసిస్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఈ చిత్ర పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆ హీరోనే అసలైన హీరో.. కంగనాని భారతదేశంకోసం  పోరాడటం చూడాలి.. తేజస్‌ ఆశాజనకంగా ఉంటుంది. అని కంగనా సోదరి రంగోలి ట్విట్టర్‌లో పోస్టర్‌తో పాటు షేర్‌ చేశారు.