మనోజ్ తో ప్రియా రొమాన్స్

మనోజ్ తో ప్రియా రొమాన్స్

18-02-2020

మనోజ్ తో ప్రియా రొమాన్స్

మూడేళ్ల గ్యాప్‌ తరువాత సొంత బ్యానర్‌పై మంచు మనోజ్‌ సర్‌ప్రైజింగ్‌ ప్రాజెక్టు ప్రకటించాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఎంచుకున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ రెడ్డి పనితనంపై నమ్మకంతో రేసులోకి దిగుతున్నాడు. వైవిధ్యమైన స్క్రిప్ట్‌లో ఫ్రెష్‌ ఫేస్‌ బెటరన్న ఆలోచనతో ఓ యాంకర్‌ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె తమిళ టెలివిజన్‌ షో హాట్‌ సెన్సేషన్‌ ప్రియా భవానీ శంకర్‌, టెలివిజన్‌ షోలో  వచ్చిన పాపులారిటీతో ప్రియా ఇప్పటికే ఓ పెద్ద ప్రాజెక్టులో చాన్స్‌ కొట్టేసింది. పాన్‌ ఇండియా క్యాటగిరిలో కమల్‌తో శంకర్‌ తెరకెక్కిస్తోన్న భారతీయుడు -2లో ఓ ప్రాత చేస్తోంది. భారతీయుడు సీక్వెల్‌ ఫేమ్‌గా ప్రియకు వచ్చే ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని మనోజ్‌ ఆమెను హీరోయిన్‌గా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.