అమ్మదీవెన ట్రైలర్ విడుదల

అమ్మదీవెన ట్రైలర్ విడుదల

17-02-2020

అమ్మదీవెన ట్రైలర్ విడుదల

ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అమ్మ దీవెన. శివ ఏటూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా ఆమె దీవెన సినిమా ట్రైలర్‌ను జీవిత రాజశేఖర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ అమ్మకొడుకు చిత్రంలో రాజశేఖర్‌ గారితో ఆమని కలిసి నటించింది. ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకుంటుందని అప్పుడే అనుకున్నాం. అలాగే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన ఆమ్మ దీవెన సినిమా విజయం సాధించాని కోరుకుంటున్నా అన్నారు. ఆమని మాట్లాడుతూ ఈ సినిమలో మంచి పాత్ర పోషించాను. నాకు ఇది రీఎంట్రీ అనుకోవచ్చు. ఐదుగురు పిల్లలున్న ఇంటికి తానే ఆధారమైన మహిళ కథ ఇది. తన పిల్లలను ఎలా చదివించి, జీవితంలో స్థిరపడేలా చేసింది అనేది చూపిస్తున్నాం. మంచి కథతో వస్తున్న ఈ సినిమా ఆదరణ పొందాలి అన్నారు.