గల్లీబాయ్ కి అవార్డుల పంట

గల్లీబాయ్ కి అవార్డుల పంట

17-02-2020

గల్లీబాయ్ కి అవార్డుల పంట

ర్యాప్‌గాయకుడిగా ఎదగాని కలు కన్న ఓ గల్లీ కుర్రాడి కథతో తెరకెక్ని గల్లీబాయ్‌ కథకు ఫిలింఫేర్‌ పురస్కారాల పంట పడింది. ఈ చిత్రానికి పలు పురస్కారాలు లభించాయి. గల్లీబాయ్‌ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోవడమే కాదు ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌ సింగ్‌, ఉత్తమ నటిగా ఆలియాభట్‌ పురస్కారాలు అందుకున్నారు. జోయా అక్తర్‌ ఉత్తమ దర్శకురాలిగా నిలిచారు. ఉత్తమ సహాయ నటుడిగా సిద్ధాంత్‌ చతుర్వేది, ఉత్తమ సహాయ నటిగా అమృతా సుభాష్‌ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ క్రిటిక్స్‌ చిత్రంగా ఆర్కికల్‌ 15, సన్‌చూరియా, ఉత్తమ క్రిటిక్స్‌ నటుడిగా ఆయుష్మాన్‌ ఖురానా (ఆర్టికల్‌ 15), శాండ్‌ ఖీ ఆంఖ్‌ చిత్రానికిగానూ ఉత్తమ క్రిటిక్స్‌ నటిగా భూమి పెడ్నేకర్‌, తాప్సి పురస్కారాలు దక్కించుకున్నారు.

గోవాలో జరిగిన 65వ ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు వేడుకకు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌, కథానాయకుడు విక్కీ  కౌశల్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధూరి దీక్షిత్‌ నుంచి రణ్‌వీర్‌ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వెండితెరపై లెజెండ్‌ మాధురి దీక్షిత్‌ నుంచి అవార్డు అందుకోవడం నాకు మర్చిపోలేని క్షణం. ఆమె నా మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటారు అని పోస్ట్‌ చేశారు రణ్‌వీర్‌.