కృష్ణ అండ్ హిజ్ లీల టీజర్ ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్‌

15-02-2020

కృష్ణ అండ్ హిజ్ లీల టీజర్ ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్‌

సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కథానాయకుడు రానా సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణ అండ్‌ హిజ్‌ లీ. క్షణంతో విజయాన్ని అందుకున్న రవికాంత్‌ పేరేపు దర్శకుడు. సిద్ధు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, శాలిని వడ్నికత్తి ప్రధాన పాత్రధారులు. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో భాగస్వామి. ప్రేమికుల రోజు సందర్భంగా కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ టీజర్‌ని విడుదల చేశారు. పులిహోర కలిపెనులే.. అంటూ సాగే పాట టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పాటని గుర్తుచేస్తూ పులిహోర కలపండమ్మా.. అని చిత్ర బృందాన్ని ట్విటర్‌ ద్వారా ఉత్సహపరిచారు వెంకటేష్‌. మే 1న ట్రైలర్‌ని విడుదల చేస్తారు.