ప్రేమికుల రోజున ఉప్పెన ఫస్ట్ లుక్

15-02-2020

ప్రేమికుల రోజున ఉప్పెన ఫస్ట్ లుక్

చిరంజీవి మేన్లుడు పంజా వైష్టవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమా ఫస్ట్ లుక్ ను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేశారు. బుచ్చిబాబు సానా దర్శకుడు. కృతిశెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. విజయ్‌ సేతుపతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పోస్టర్‌లో మాస్‌ లుక్‌లో వైష్టవ్‌ తేజ్‌ ఆకట్టుకుంటున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.