విడుదలకు సిద్ధమైన అర్జున

విడుదలకు సిద్ధమైన అర్జున

15-02-2020

విడుదలకు సిద్ధమైన అర్జున

రాజశేఖర్‌ ద్విపాత్రాభినయంగా దర్శకుడు కన్మణి తెరకెక్కిస్తోన్న చిత్రం అర్జున. రాజశేఖర్‌తో మరియం జకారియో జోడీకట్టింది. నట్టీస్‌, క్వీటీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించిన చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ తండ్రీ కొడుకు పాత్రల్లో రాజశేఖర్‌ బెస్ట్‌ పెర్మార్మెన్స్‌ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ నేపథ్య పరిస్థితులను అద్దంపట్టే చిత్రమిది. తండ్రీ కొడుకు మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌. యథార్థ సంఘటను ప్రేరుణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా కన్నణి ఈ చిత్రాన్ని మలిచారు. త్వరలోనే ట్రైలర్‌ విడుదల చేసి సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. కోట శ్రీనివాస రావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్‌, కాదంబరి కిరణ్‌, శివాజీ రాజా తదితరులు  ఇతర పాత్రలు పోషిస్తున్నారు.