కల్యాణ్ దేవ్ సరసన రచితా రామ్

కల్యాణ్ దేవ్ సరసన రచితా రామ్

15-02-2020

కల్యాణ్ దేవ్ సరసన రచితా రామ్

కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సూపర్‌ మచ్చి. రచితారామ్‌ నాయిక. పులి వాసు దర్శకుడు. రిజ్వాన్‌, ఖుషి నిర్మాతలు. వచ్చే నెలలో గోవాలో రెండు పాటల్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ప్రేమకథతో కూడిన ఒక మంచి కుటుంబ కథా చిత్రమిది. కల్యాణ్‌దేవ్‌ అటూ మాస్‌ని, ఇటు కుటుంబ ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే పాత్రలో కనిపిస్తారు. ఆయన, కథానాయిక రచితా రామ్‌ని తెరపై చూశాక సూపర్‌ జోడీ అని మెచ్చుకుంటారు. రాజేంద్రప్రసాద్‌, నరేష్‌లు పంచే హాస్యం చిత్రానికి ప్రధాన బలం. తమన్‌ స్వరపరిచిన ఐదు పాటలలో ఇప్పటికే రెండు పాటల్ని చిత్రీకరించాం అన్నారు.