అరణ్య టీజర్ విడుదల

అరణ్య టీజర్ విడుదల

14-02-2020

అరణ్య టీజర్ విడుదల

రానా హీరోగా నటించిన చిత్రం అరణ్య. హిందీలో హాథీ మేరే సాథి, తమిళంలో కాండన్‌ పేర్లతో విడుదవుతోంది. ప్రభు సాల్మన్‌  దర్శకుడు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న వస్తోంది. హైదరాబాద్‌లో టీజర్‌ని ఆవిష్కరించారు. రానా మాట్లాడుతూ 1300 ఎకరాల అడవిని పెంచి పద్మశ్రీ అందుకున్న జాదవ్‌ ప్రియాంక్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సినిమాల్లో నటించడం వల్ల నేనెన్నో  విషయాల్ని నేర్చుకోగలిగాను. కానీ అరణ్యతో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నా. సెల్‌ఫోన్లూ, ఇంటర్నెట్టూ లేని ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. దాంతో నా గురించి నేను తెలుసుకోగలిగాను. పర్యావరణంలో మనం ఓ భాగం అని చెప్పే గొప్ప కథ ఇదన్నారు. ఏనుగుతో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డామన్నారు దర్శకుడు. సురేష్‌బాబు నందు అహూజా, మానవ్‌ సేతీ తదితరులు  పాల్గొన్నారు.