నయన బాటలోనే సమంత!

నయన బాటలోనే సమంత!

14-02-2020

నయన బాటలోనే సమంత!

సవాళ్లతో కూడిన పాత్రలు అనగానే దక్షిణాది చిత్రసీమలో తొలుత గుర్తుకొచ్చే కథానాయిక నయనతార. ప్రస్తుతం ఆమె బాటలోనే సమంత అడుగులు వేస్తున్నారు. మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక ఇతివృత్తాలతో ఈ కథానాయికలిద్దరూ విజయాల్ని అందుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నయనతార, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నానుమ్‌ రౌడీథాన్‌ తర్వాత విజయ్‌ సేతుపతి హీరోగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది. ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయన తార, సమంత కథానాయికుగా నటించనున్నట్లు చెబుతున్నారు. కాతు వకు రెండు కాదల్‌ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు సమచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి రానున్నట్లు తెలిసింది.