Ala Vaikunthapurramuloo Teaser Released

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. ఈ చిత్రం టీజర్‌ సామాజిక మాధ్యమంలో విడుదలైంది. టీజర్‌ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు ఈ టీజర్‌, వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఈ టీజర్‌లో ''నువ్వు ఇప్పుడే కార్‌ దిగావ్‌, నేను ఇప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా'' అని చెప్పే డైలాగ్‌ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.