Shiva 143 Movie Trailer released

చిన్న సినిమాలు మాత్రమే తీస్తాను అని ఒట్టు పెట్టుకుని బడ్జెట్‌ దాటకుండా చిత్రాలు తీస్తున్నాడు రామ సత్యనారాయణ. ఒక ఫ్లాప్‌ తీస్తే ఆ నిర్మాత మళ్లీ సినిమా తీయలేని పరిస్థితులున్న ఈ రోజుల్లో హిట్‌, ఫ్లాప్‌కి అతీతంగా సేఫ్‌గా సినిమాలు తీస్తున్నాడు. ఈ శివ 143 సినిమా విజయం సాధించాలి అన్నారు నిర్మాత సి.కళ్యాణ్‌. శైలేష్‌ సాగర్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం శివ 143. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ నేను హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఓనమాలు దిద్దించారు కళ్యాణ్‌గారు. నేను ఇన్ని సినిమాలు తీశానంటే అది ఆయన నేర్పిన విద్యే అన్నారు. భీమవరం టాకీస్‌ బ్యానర్‌లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది అన్నారు శైలేష్‌ సాగర్‌. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్‌, సంగీతం: మనోజ్‌.