Mattu Vadalara Teaser Released

గీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా... ఈ చిత్రం టీజర్‌ను రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థలం సమయంలో సింహాతో కలిసి వర్క్‌చేశానని, ఆ ప్రయాణం మరపురానిదని అన్నారు అన్నారు. రితేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు.. కీరవాణి పెద్దకుమారుడు కాలభైరవ స్వరానలు అందిస్తున్నారు. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతోంది.