Disco Raja Teaser Released

రవితేజ మాస్‌రాజా. వీఐ ఆనంద్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా సినిమా కోసం డిస్కో రాజా గా మారారు. తాజాగా డిస్కో రాజా టీజర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌లో చాలా క్లాస్‌గా కనిపిస్తూ క్లాస్‌ రాజాలా ఉన్నారు రవితేజ. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌, తాన్యా హోప్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. 1980-2019 ఇలా రెండు టైమ్‌లైన్స్‌ లో కథ నడుస్తుందని సమాచారం. టీజర్‌ని చూస్తే రవితజే మీద ఏదో ప్రయోగం జరిగినట్టు అర్థం అవుతోంది. మరి ఆ ప్రయోగం వల్ల రవితేజకు ఏం జరిగింది. దాని వల్ల విలన్స్‌కి ఏం జరిగిందో తెలియాలి. రవితేజ ఫ్యాన్స్‌ కోరుకునే విధంగా ఆయన రెట్రో గెటప్‌ ఉంటుంది. అందరికీ నచ్చే విధంగా సినిమాను సిద్ధం చేస్తున్నాం అని చిత్ర బృందం తెలిపింది. 2020 జనవరి 24న డిస్కో రాజా విడుదల కానుంది.