Ruler Pre Release Event On 14th Dec At MGM Grounds Vizag

నటసింహ బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం రూలర్‌. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న వైజాగ్‌ ఎంజిఎం గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో ఎంటైర్‌ యూనిట్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. బాలయ్య ఇందులో రెండు పవర్‌పుల్‌ షేడ్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్స్‌, టీజర్‌, లిరికల్‌ వీడియోసాంగ్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోనాల్‌చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.