ఈ మనసే గీతాన్ని విడుదల చేసిన పవన్‌

02-12-2019

ఈ మనసే గీతాన్ని విడుదల చేసిన పవన్‌

మిస్‌మ్యాచ్‌ సినిమా పెద్ద విజయం సాధించాలి. హీరోగా ఉదయ్‌శంకర్‌కు శుభారంభాన్ని అందించాలి అని అన్నారు పవన్‌కల్యాణ్‌. ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్యారాజేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం మిస్‌మ్యాచ్‌. జి.శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్‌ నిర్మాతలు. ఎస్‌.వి.నిర్మల్‌కుమార్‌ దర్శకుడు. ఈ నెల 6న విడుదల కానుంది. తొలిప్రేమ లోని ఈ మనసే పాటను సినిమాలో రీమిక్స్‌ చేశారు. ఈ గీతాన్ని పవన్‌కల్యాణ్‌ విడుదల చేశారు. ఉదయ్‌శంకర్‌ మాట్లాడుతూ కుటుంబ విలువలు, ప్రేమ, ఉద్వేగాల సమాహారంగా తెరకెక్కుతున్న క్రీడా నేపథ్య చిత్రమిది. పవన్‌ కల్యాణ్‌ సినిమా పాటను నాపై చిత్రీకరించడం ఆనందంగా ఉంది. సింగిల్‌షాట్‌లో ఈ గీతాన్ని చిత్రీకరించాం. హీరోగా నాకు మంచి గుర్తింప్తును తెచ్చిపెడుతుందనే నమ్మకముంది అన్నారు.