సింగపూర్‌లో నాగచైతన్య, సామ్‌ ఎంజాయ్‌

02-12-2019

సింగపూర్‌లో నాగచైతన్య, సామ్‌ ఎంజాయ్‌

షూటింగ్స్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చారు నాగచైతన్య, సమంత. హాలీడేను ఎంజాయ్‌ చేయడానికి సింగపూర్‌ వెళ్లారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల సినిమా షూటింగ్స్‌తో నాగచైతన్య బిజీగా ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవ్వడానికి సిద్ధమవుతున్నారు సమంత. ఈ మధ్యలో దొరికిన చిన్న బ్రేక్‌ను హాలీడేగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో హాలిడేయింగ్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు సమంత.