అమెరికాలో ముందుగా విడుదల

02-12-2019

అమెరికాలో ముందుగా విడుదల

శ్రీనివాస్‌ సాయి, భావనరావు జంటగా అజయ్‌ మణి కందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మథనం. దివ్య ప్రసాద్‌, అశోక్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న అమెరికాలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత ఇండియాలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను డైరెక్టర్‌ సుకుమార్‌ విడుదల చేసి, మాట్లాడుతూ.. ట్రైలర్‌ విభిన్నంగా ఉంది. అశోక్‌ ప్రసాద్‌ ప్యాషన్‌ ఉన్న నిర్మాత. నా సినిమా 1 నేనొక్కడినే కూడా అమెరికాలో బాగా ఆడింది. మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు అన్నారు. అశోక్‌కి సినిమా అంటే పిచ్చి. కొత్త పాయింట్‌తో మంచి ప్రయత్నం చేశారు అన్నారు డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి. వాస్తవ సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాశా అన్నారు అజయ్‌. కేవలం అమెరికాలో సినిమా రిలీజ్‌ చేయడం ఇదే మొదటిసారి అన్నారు అశోక్‌ ప్రసాద్‌. ఎన్‌ఆర్‌ఐ నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, అనిల్‌ సుంకరలాగా అశోక్‌ మంచి హిట్‌ చిత్రాలు తీయాలి అన్నారు.