మొదలైంది ... రీసౌండ్‌

02-12-2019

మొదలైంది ... రీసౌండ్‌

సాయిరామ్‌ శంకర్‌, రాశి సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం రీ సౌండ్‌. కృష్ణ చిరుమామిళ్ల దర్శకుడు. సురేష్‌ రెడ్డి, రాజు, రాజారెడ్డి నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ క్లాప్‌నిచ్చారు. సురేందర్‌ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పోసాని కృష్ణ మురళి గౌరవ దర్శకత్వం వహించారు. కథ కథనాలు కొత్తగా ఉంటాయి. నేటి నుంచే చిత్రీకరణ మొదలెడుతున్నాం. హైదరాబాద్‌, విశాఖపట్నంలో తెరకెక్కిస్తామన్నారు దర్శకుడు. వాణిజ్య విలువలున్న చిత్రమిది. సాయిరామ్‌కి మరో మంచి సినిమా అవుతుందని నిర్మాతలు తెలిపారు.