దక్షిణాదిలో తొలి రికార్డు

02-12-2019

దక్షిణాదిలో తొలి రికార్డు

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న అల వైకుంఠపురములో.. చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో ఇప్పటికే విడుదలైన సామజవరగమన గీతానికి యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. సౌత్‌ ఇండియాలో ఒక పాటకు ఇన్ని వ్యూస్‌ రావడం ఇదే ప్రథమం. రికార్డ్‌ స్థాయిలో వ్యూస్‌ సాధించిన తెలుగు పాటకు నెటిజన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఈ పాటకు లక్షల్లో టిక్‌ టాక్‌లు చేసి హిట్‌ చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతానికి తమన్‌ బాణీలు సమకూర్చారు. సిద్‌ శ్రీరామ్‌ పాడారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్లలో రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.