సిండ్రెల్లాగా రాయ్‌ లక్ష్మీ...

02-12-2019

సిండ్రెల్లాగా రాయ్‌ లక్ష్మీ...

తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న నాయిక రాయ్‌ లక్ష్మి చేస్తున్న మరో కొత్త ప్రయత్నం సిండ్రెల్లా. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు మందాల రవికిరణ్‌, ఎం.ఎస్‌ రాజు ఈ చిత్రానికి సహ నిర్మాత. విను వెంకటేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ చిత్రం. సిండ్రెల్లా సినిమాలో రోబో శంకర్‌, అభినయ, అరవింద్‌ ఆకాష్‌, సాక్షి అగర్వాల్‌, వినోద్‌, అన్భూ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు.